News June 24, 2024
విజయనగరం వైసీపీ కార్యాలయానికి నోటీసులు

విజయనగరం జిల్లా కేంద్రం రింగురోడ్డు సమీపంలోని మహరాజుపేట వద్ద నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయ భవనం అక్రమమని నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీచేశారు. వీఎంఆర్డీఏ అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొంటూ.. నిర్మాణ పనులు తక్షణం నిలుపు చేయాలని, వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని పార్టీ ప్రతినిధులకు సూచించారు. కాగా సుమారు ఎకరా స్థలంలో ఇక్కడ వైసీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది.
Similar News
News February 10, 2025
బెస్ట్ విలన్ టాలెంట్ అవార్డు అందుకున్న బాడంగి దాసరి

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ విలన్ టాలెంట్ అవార్డును బాడంగికి చెందిన దాసరి తిరుపతినాయుడు ఆదివారం అందుకున్నారు. విప్లవ నటుడు ఆర్.నారాయణమూర్తి నటించిన యూనివర్సిటీ చిత్రంలో విలన్’గా దాసరి నటించాడు. బాడంగి మండలం గొల్లాది గ్రామానికి చెందిన తిరుపతినాయుడు డ్రామా ఆర్టిస్టుగా పనిచేసేవారు. సినిమాలో అవకాశం రావడంతో విలన్’గా నటించి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
News February 10, 2025
VZM: 3 లక్షల మందికి ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు DMHO డాక్టర్ జీవనరాణి తెలిపారు. ఈ మాత్రల పంపిణీ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుందన్నారు. మాత్రలను నమిలి మింగాల్సి ఉంటుందని, దీంతో పిల్లల్లో ఉండే నులి పురుగులు నశించి రక్తహీనత బారిన పడకుండా ఉంటారని తెలిపారు. ఏడాదికి రెండుసార్లు నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
News February 10, 2025
అల్బెండజాల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం: కలెక్టర్

జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినొత్సవం సందర్భంగా సోమవారం అల్బెండజోల్ మాత్రల పంపిణీకి సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల మధ్యవయస్సు గల చిన్నారులు, విద్యార్ధులకు మాత్రల పంపిణీ కోసం ఏర్పాట్లు చేశామన్నారు. మాత్రల్ని గుర్ల మినహా అన్ని మండలాలకు ఇప్పటికే అందజేశామని పేర్కొన్నారు. స్కూల్ యాజమాన్యాలతో పాటు ప్రజలందరూ సహకరించాలని కోరారు.