News February 22, 2025
విజయనగరం వైసీపీ ప్రచార కార్యదర్శిగా బొద్దల

వైసీపీ విజయనగరం జిల్లా ప్రచార కార్యదర్శిగా బొద్దల సత్యనారాయణను నియమిస్తూ అధిష్టానం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడుకు సత్యనారాయణ కృతజ్ఞతలు చెప్పారు. బొబ్బిలి మండలం ముత్తావలస గ్రామానికి చెందిన సత్యనారాయణ సర్పంచిగా పని చేశారు. వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.
Similar News
News February 23, 2025
గింజేరు జంక్షన్‌లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

గంట్యాడ మండలం గింజేరు జంక్షన్ వద్ద రెండు బైకులు ఢీకొట్టిన ఘటనలో ఆనంద్(55) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతుడు విజయనగరం నుంచి ఎస్.కోట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆనంద్ తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం విజయనగరం కేంద్రాసుపత్రికి 108లో తరలించారు.
News February 23, 2025
రఘువర్మకే జనసేన మద్దతు: మంత్రి నాదెండ్ల

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకే తమ మద్దతు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా జనసేన అండగా నిలుస్తుందో.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకే మాటపై నిలబడాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రఘువర్మకు ప్రథమ ప్రాధాన్యత ఓట్లు పడేలా చూడాలన్నారు.
News February 23, 2025
రైతుల సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియ: JC

రైతుల సమక్షంలోనే రీ సర్వే ప్రక్రియను నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. భోగాపురం మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న రావాడ గ్రామంలో నిర్వహిస్తున్న రీ సర్వే ప్రక్రియను ఆయన పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. గ్రౌండ్ ట్రూతింగ్‌ను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.