News December 23, 2024
విజయనగరం వై జంక్షన్లో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

వీటీ అగ్రహారానికి చెందిన మురళీ విజయనగరం వైజంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఏఎస్ఐ రామరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఇంటివద్ద నుంచి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
Similar News
News January 6, 2026
VZM: ‘GOOD NEWS… కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ’

జిల్లాలో SC కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు వడ్డీ మాఫీ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. NSFDC పథకం ద్వారా రుణాలు పొందిన 297 మందికి రూ.96.60 లక్షలు, NSKFDC పథకం ద్వారా రుణాలు పొందిన 173 మందికి రూ.47.18 లక్షల వడ్డీ మాఫీ వర్తిస్తుందన్నారు. ఈ సౌకర్యం పొందాలంటే లబ్ధిదారులు 4నెలల్లోపు రుణాల అసలు మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలన్నారు.
News January 6, 2026
VZM: కేజీబీవీల్లో 63 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 63 బోధనేతర పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి<<18747389>> దరఖాస్తులు<<>> కోరుతున్నట్లు అదనపు పథక సమన్వయకర్త రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 06 నుంచి 20 లోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆఫ్లైన్లో సమర్పించాలని, ఎంపిక మండల యూనిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు vizianagaram.ap.gov.inలో చూడాలని సూచించారు.
News January 6, 2026
విజయనగరం కలెక్టరేట్కు 297 అర్జీలు

విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమానికి మొత్తం 297 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు 149, డీఆర్డీఏకు 64, పంచాయితీ రాజ్ శాఖకు 22, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు 8, విద్యుత్ శాఖకు 4, విద్యా శాఖకు 3, గృహ నిర్మాణ శాఖకు 2, మున్సిపల్ పరిపాలనకు 2, డీసీహెచ్ఎస్కు 1, ఇతర శాఖలకు సంబంధించిన 42 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు.


