News March 28, 2025
విజయనగరం: శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలను సంప్రదాయభద్దంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి కోరారు. ఉగాది వేడుకల నిర్వహణపై తమ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ అంబేడ్కర్ సూచనల మేరకు ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News October 29, 2025
రేషన్ సరకుల పంపిణీ శతశాతం పూర్తి కావాలి: VZM కలెక్టర్

రేషన్ పంపిణీ బుధవారం లోగా శతశాతం పూర్తి కావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో మంగళవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. నవంబరు నెల రేషన్ సరకుల పంపిణీని ముందుగానే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికే జిల్లాలో పంపిణీ మొదలయ్యిందని చెప్పారు. బుధవారం నాటికి అన్ని గ్రామాల్లో శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
News October 29, 2025
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు: జడ్పీ ఛైర్మన్

గుర్ల కేజీబీవీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఐదుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. సమాచారం తెలుసుకున్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు నెల్లిమర్ల ప్రభుత్వాసుపత్రి వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఐదుగురు విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని చిన్న శ్రీను విజ్ఞప్తి చేశారు.
News October 28, 2025
VZM: ‘24 గంటలు విధుల్లో ఉండాలి’

మొంథా తుఫానును దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన 71 పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాలని జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ పట్టంశెట్టి ఆదేశించారు. కాల్ సెంటర్లతో పాటు సచివాలయాలు, పునరావాస కేంద్రాల్లో కూడా ప్రభుత్వ సిబ్బంది షిఫ్టులవారీగా 24 గంటలు విధులను నిర్వహించాలని స్పష్టం చేశారు. రేషన్ సరకులు, తాగునీరు, మందులు, ఇతర వస్తువులును సిద్ధంగా ఉంచాలన్నారు.


