News July 11, 2024
విజయనగరం: సచివాలయ కార్యదర్శులకు మెమోలు

విజయనగరం పట్టణంలోని గోకపేటలో 45వ సచివాలయాన్ని విజయనగరం కమిషనర్ మల్లయ్య నాయుడు బుధవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇద్దరు సచివాలయ కార్యదర్శులు విధులకు గైర్హాజరు కావడంతో వారికి శ్రీముఖాలు జారీ చేశారు. రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంపై సిబ్బందిపై మండిపడ్డారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News October 16, 2025
ఉద్యోగుల కోసం రేపు ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం: VZM కలెక్టర్

ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారని వెల్లడించారు. ఉద్యోగులు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించవచ్చునని పేర్కొన్నారు. జిల్లా అధికారులంతా సకాలంలో హాజరు కావాలని కోరారు.
News October 16, 2025
VZM: ఆర్టీసీ సేవల్లో సమస్యలపై తెలయజేయండి

ఆర్టీసీ సేవల్లో సమస్యల తెలుసుకునేందుకు నేడు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రజారవాణాధికారిణి జి.వరలక్ష్మి తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఫిర్యాదు స్వీకరించనున్నారు. విజయనగరం జిల్లా పరిధిలో గల ప్రయాణికులు, తమ సలహాలు, సూచనలు, సమస్యలపై 99592 25604 నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.
News October 16, 2025
VZM: రైలులో గంజాయితో ఇద్దరు అరెస్టు

ఒడిశాలోని మునిగుడ నుంచి కేరళ తరలిస్తున్న మూడు కిలోల గంజాయి పట్టుకున్నట్ల రైల్వే ఎస్ఐ బాలాజీరావు చెప్పారు. పార్వతీపురం రైల్వే స్టేషన్ నుంచి విజయనగరం రైల్వే స్టేషన్ మధ్యలో ఏర్నాకులం రైలులో తనిఖీలు చేస్తుండగా కేరళకు చెందిన సుని, గోవిందరాజు నుంచి మూడు కిలోల గంజాయి సీజ్ చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. గంజాయి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని రైల్వే పోలీసులు చెప్పారు.