News July 20, 2024
విజయనగరం: సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సీజనల్ వ్యాధులపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, తాగునీరు కలుషితం కాకుండ చేపట్టాల్సిన చర్యలు డెంగీ మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డీసీహెచ్ఎస్, జడ్పీ సీఈవో, డీపీఓ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Similar News
News December 10, 2025
VZM: ‘గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరు’

జిల్లాలో గ్రామీణ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.84.62 కోట్లు మంజూరయ్యాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. మొత్తం 67 పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసిందన్నారు. బొబ్బిలి-8, చీపురుపల్లి-10, గజపతినగరం-7, నెల్లిమర్ల-17, రాజాం-6, ఎస్.కోట-7, విజయనగరం-12 పనులకు ఆమోదం లభించిందన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో ఈ అనుమతులు వచ్చినట్లు వెల్లడించారు.
News December 10, 2025
VZM: ‘జిల్లాలో ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి’

జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం విజయనగరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిగింది. కేంద్రీయ గిరిజన వర్శిటీ, భోగాపురం విమానాశ్రయం, తోటపల్లి, తారకరామ ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, కుర్ధారోడ్-విజయనగరం మూడో రైల్వే లైన్, కొత్తవలస-విజయనగరం నాలుగో రైల్వే లైన్ భూ సేకరణ స్థితిపై సమీక్షించారు.