News October 26, 2024
విజయనగరం: స్నానాల గదిలో జారిపడి వైద్యుడి మృతి

ప్రమాదవశాత్తూ కాలు జారడంతో ఓ వైద్యుడు మరణించిన ఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆశోక్ కుమార్ వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లాకు చెందిన పవన్ కుమార్ (44) నెల్లిమర్ల సమీపంలోని మిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 24న స్నానం చేసేందుకు వెళ్లి కాలుజారి కిందపడ్డాడు. తలకు బలమైన దెబ్బ తగలడంతో విమ్స్కు తరలించారు. అదే రోజు మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 20, 2025
VZM: ‘ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు’

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి తవిటి నాయుడు అన్నారు. విజయనగరంలోని RIO కార్యాలయంలో గురువారం మాట్లాడారు. ఫిబ్రవరి 23 – మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు 66 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నమన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
News November 20, 2025
భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష: DSP

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2022లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడు కలిశెట్టి వీరబాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు DSP గోవిందరావు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో శారీరక, మానసిక వేధింపులు చేసిన భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. సాక్ష్యాలు రుజువుకావడంతో JFCM స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి. బుజ్జి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.
News November 19, 2025
జిల్లాలో పర్యటించనున్న షెడ్యూల్డ్ కులాల కమీషన్: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ ఆధ్వర్యంలో కమిటీ జిల్లాలో శుక్రవారం పర్యటించనుంది. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.


