News February 22, 2025
విజయనగరం: 10వ తరగతి విద్యార్థి మృతి

విజయనగరం జిల్లాలో విషాద ఘటన జరిగింది. డెంకాడ మండలం పినతాడివాడకు చెందిన గంగరాజు కుమారుడు రాజు(17) మెర్సీ మిషన్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పెదతాడివాడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన శుభకార్యానికి అతను వెళ్లాడు. తిరిగి బైకుపై ఇంటికి వస్తుండగా పెదతాడివాడ, పినతాడివాడ గ్రామాల మధ్య ట్రాక్టర్ ట్యాంకర్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అతను చనిపోయాడు.
Similar News
News November 15, 2025
GWL: షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి

గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్, రాజాపూర్ గ్రామాలకు చెందిన ‘పల్లెటూరి కుర్రాళ్లు’ ట్రూప్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌కు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి అవగాహన కల్పిస్తూ దీనిని రూపొందించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో దీనిని ఎంపిక చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ శివధర్ రెడ్డి బహుమతి అందజేశారు.
News November 15, 2025
చనిపోయే ముందు భార్యకు ఫోన్ చేసిన సతీశ్.?

మాజీ AVSO సతీశ్ హత్య కేసును గుత్తి రైల్వే పోలీసులు తాడిపత్రికి బదిలీ చేశారు. చనిపోయిన రోజు రాత్రి సతీశ్ తన <<18293157>>భార్యకు<<>> 1.20 గం.కు ఫోన్ చేసినట్లు సమాచారం. 4సార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో ‘డిస్ కంఫర్ట్’గా ఉందని వాట్సాప్ మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకు ఆయన ఈమెసేజ్ చేశారన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. సతీశ్ మృతదేహం గుర్తించిన స్పాట్‌కు CID డీజీ రవిశంకర్ అయ్యన్నార్, DIG షిమోషి, SP చేరుకున్నారు.
News November 15, 2025
చిత్తూరు: రేడియో కాలర్ టెక్నాలజీకి కేంద్ర గ్రీన్ సిగ్నల్.!

ఉమ్మడి జిల్లాలో ఆరు ఏనుగుల గుంపులకు <<18292966>>రేడియో కాలర్<<>> టెక్నాలజీని అమర్చేలా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒంటరి ఏనుగులు, చిరుతలు, ఇతర జంతువులు అడవి నుంచి బయటకు రాకుండా AI టెక్నాలజీని వినియోగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా AI బేస్డ్ ఇన్ఫ్రారెడ్ కెమెరాల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించినట్లు సమాచారం. 120 కెమెరాలను అమర్చి మానవ-జంతువుల మధ్య ఘర్షణ నివారణ చర్యలు చేపట్టనుంది.


