News September 12, 2024
విజయనగరం: JNTUలో సైబర్ నేరాల నియంత్రణపై సెమినార్
సైబర్ నేరాల నియంత్రణపై విజయనగరం JNTUలో మూడు రోజులు పాటు జరగనున్న జాతీయ సెమినార్ బుధవారం ప్రారంభం అయింది. సెమినార్‌ను జైపూర్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి పి.అరుణకుమారి ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణకు టెక్నాలజీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సైబర్ మోసాలను ఎలా నియంత్రించాలో ఆచరణాత్మక పద్ధతిలో విద్యార్థులకు వివరించారు.
Similar News
News October 3, 2024
సాలూరు- విశాఖ వయా బొబ్బిలి.. రేపే ట్రైల్ రన్
కొన్నేళ్ల నుంచి ట్రైన్ సాలూరు వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజలకు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహిస్తున్నట్లుగా తెలియ వచ్చింది. రేపు ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై 12.30కు బొబ్బిలి 1.10 కి సాలూరు చేరుకుని తిరుగు ప్రయాణమై సాయంత్రం 4.30 గంటలకు విశాఖపట్నం చేరుకోనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం రైల్వే అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.
News October 3, 2024
VZM: టెట్ ఎగ్జామ్‌కి వెళ్లే వారు ఇవి పాటించండి
ఈ రోజు నుంచి జరిగే టెట్ ఆన్లైన్ పరీక్షలకు అభ్యర్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి 30 నిమిషాలు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ ఐడీ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వీహెచ్, పీహెచ్ అభ్యర్థులకు 50 నిమిషాలు అదనంగా సమయం కేటాయిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలతో రావడం నిషేధం.
News October 3, 2024
విజయనగరం: టెట్ ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఇవే..
నేటి నుంచి ప్రారంభం కానున్న టెట్ పరీక్షలకు జిల్లాలో 22,979 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. పరీక్షల కోసం జిల్లాలో 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
⁍ స్వామి వివేకానంద ఇంజినీరింగ్ కళాశాల (కలవరాయి, బొబ్బిలి మండలం)
⁍ ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల
⁍ సత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(గాజులరేగ)
⁍ అయాన్ డిజిటల్ జోన్ (గాజులరేగ)
⁍ జొన్నాడ లెండీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 21 వరకు ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి.