News December 7, 2024

విజయనగరం: RTC బస్సు ఢీకొని ఒకరి మృతి

image

విజయనగరం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. దత్తిరాజేరు మండలం పేదమానాపురంలో సంత జరిగింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో వంగరకు చెందిన గెంజి మహేశ్, తిరండి నరసింహారావు, కొలుసు రమణ గొర్రెలతో సంతకు బయల్దేరారు. ఈక్రమంలో పార్వతీపురం నుంచి విజయనగరం వెళ్తున్న RTC బస్సు వీరిని ఢీకొట్టింది. మహేశ్ అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయలయ్యాయి.

Similar News

News December 21, 2025

విజయనగరంలో పోలియో చుక్కలు వేసిన కలెక్టర్

image

విజయనగరం పట్టణంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు 1,172 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు ఉన్న సుమారు 2 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

News December 21, 2025

VZM: జిల్లా వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమం

image

జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. 0-5 ఏళ్లలోపు 1,99,386 మంది చిన్నారులు లక్ష్యంగా పోలియో చుక్కలు వేయనున్నారు. దీనికోసం మొత్తం 1,171 పోలియో కేంద్రాలు, 20 ట్రాన్సిట్ టీమ్‌లు, 66 సంచార బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 22, 23, 24వ తేదీల్లో ఇంటింటా సర్వే ఉంటుందన్నారు.

News December 21, 2025

భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై కలెక్టర్ సమీక్ష

image

భోగాపురం మండలం సవరవల్లి–తూడెం మార్గం ద్వారా భోగాపురం రోడ్డు కనెక్టివిటీ పనులపై జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం సమీక్షించారు. రహదారిపై మామూలు కల్వర్టు స్థానంలో బాక్స్ కల్వర్టు ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా సవరించిన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు పనులను 5, 6 నెలల్లో పూర్తిచేయాలని సూచించారు.