News July 19, 2024
విజయనగర: ప్రజలకు విద్యుత్ శాఖ వారి సూచనలు

గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసిన విద్యుత్ స్తంభాలను నేరుగా తాకరాదని విద్యుత్ శాఖ SE మువ్వల లక్ష్మణరావు సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా విద్యుత్ తీగలు మీద చెట్లు విరిగిపడిన, విద్యుత్ తీగలు తెగిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంట్లో విద్యుత్ పరికరాలను తడి చేతితో తాకవద్దన్నారు. విద్యుత్ ప్రమాదాలను గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు గాని, 1912 టోల్ ఫ్రీ నంబరుకు తెలియజేయాలన్నారు.
Similar News
News September 19, 2025
భోగాపురం విమానాశ్రయ భూములపై కలెక్టర్ ఆరా

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ రామసుందర రెడ్డి గురువారం సమీక్షా నిర్వహించారు. ఇప్పటివరకు జిఎంఆర్కు అప్పగించిన 2,200 ఎకరాల భూముల పరిస్థితి, వాటికి సంబంధించిన సమస్యలు తెలుసుకున్నారు. విమానయాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన 540 ఎకరాల భూములపై ఆరా తీశారు.
News September 18, 2025
VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.
News September 18, 2025
పెళ్లి పేరుతో మోసం చేసిన ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదు: SI

సంతకవిటి పోలీస్ స్టేషన్లో గురువారం ఓ ఆర్మీ ఉద్యోగిపై కేసు నమోదైంది. SI గోపాలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి కొన్నేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. తర్వాత ముఖం చాటేశాడని, దీంతో ఆర్మీ ఉద్యోగిపై సదరు యువతి గురువారం సంతకవిటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని SI పేర్కొన్నారు.