News November 7, 2024
విజయపురం కానిస్టేబుల్ మృతి

విజయపురం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తంగరాజ్ అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. నగరి మండలం వేలావడి గ్రామానికి చెందిన తంగరాజు గతంలో పిచ్చాటూరు, నాగలాపురం మండల పోలీస్ స్టేషన్లో పనిచేసి బదిలీపై విజయపురం వచ్చారు. తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. స్టేషన్ సిబ్బంది, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Similar News
News December 3, 2025
చిత్తూరు జిల్లాలో వర్షపాత వివరాలు

చిత్తూరు జిల్లాలో బుధవారం కురిసిన వర్షపాత వివరాలను అధికారులు తెలియజేశారు. విజయపురంలో అత్యధికంగా 24.2 మీ.మీ వర్షపాతం నమోదయింది. కార్వేటి నగరంలో 18, వెదురుకుప్పంలో 12.6, సోమలలో 12.4, రొంపిచర్ల 9.2, ఎస్.ఆర్ పురంలో 7.2, పాలసముద్రం 6.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు సాధారణ జనజీవనానికి ఆటంకం ఏర్పడుతోంది.
News December 3, 2025
చిత్తూరు: డిప్యూటీ MPDOలకు కీలక బాధ్యతలు

చిత్తూరు జిల్లాలో సచివాలయాలను పర్యవేక్షించేలా డిప్యూటీ ఎంపీడీవోలను నియమిస్తున్నారు. మండలంలోని 31 మండలాల్లో 504 గ్రామ సచివాలయాలు, 108 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇప్పటికే 27మంది డిప్యూటీ ఎంపీడీవోలు విధుల్లో చేరారు. సచివాలయాల్లో మెరుగైన సేవలు అందించేలా వీరు పర్యవేక్షణ చేయనున్నారు.
News December 3, 2025
చిత్తూరు: 10Th, ఇంటర్ చదవాలని అనుకుంటున్నారా?

చిత్తూరు జిల్లాలోని ఓపెన్ స్కూల్లో 10వ తరగతి, ఇంటర్ చదివేందుకు ఈనెల 10వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు పొందేవారు ఫీజుతో పాటు తాత్కాల్ రుసుం రూ.600 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు జిల్లాలోని కోఆర్డినేటర్ సెంటర్లు, డీఈవో కార్యాలయంలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.


