News February 15, 2025
విజయపురి సౌత్లో ఐదు పులుల కదలికలు

వెల్దుర్తి మండలం విజయపురి సౌత్ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఐదు పులుల కదలికలను గుర్తించామని ఫారెస్ట్ రేంజర్ సుజాత తెలిపారు. పులుల లెక్కింపు పూర్తయినట్లు తెలిపారు. ఒక ఆడ, మగ పులితో పాటు, 3 పులి పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఫారెస్ట్లోకి వెళ్లొద్దని, నీటికై గ్రామాలలోకి పులులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఆ పులులు కొట్లాడుకుంటూ ట్రాప్ కెమరాలకు చిక్కాయి.
Similar News
News November 28, 2025
కృష్ణా: జనసేనకు దిక్కెవరు..?

కూటమి విజయంపై జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో TDP-YCP నేతలే పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. జనసేన నేతలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం లేదని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు టాక్. జనసేన MP ఉన్నా లేనట్టుగానే పరిస్థితి ఉండటంతో, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ చురుకుదనంపై కేడర్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
News November 28, 2025
ఇతిహాసాలు క్విజ్ – 80 సమాధానాలు

ప్రశ్న: ఉప పాండవులను ఎవరు, ఎందుకు చంపారు?
సమాధానం: ఉప పాండవులను చంపింది అశ్వత్థామ. కురుక్షేత్రంలో తన తండ్రి ద్రోణాచార్యుడి మరణానికి ప్రతీకారంగా, ఆయనను అన్యాయంగా చంపారని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. యుద్ధ రీతిని వీడి, నైతికతను మరచి నిద్రిస్తున్న పాండవుల కుమారులను పాండవులుగా భ్రమించి దారుణంగా చంపాడు. కౌరవ సేనాపతిగా చనిపోతున్న దుర్యోధనుడికిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 28, 2025
డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగుల పంపిణీ: విశాఖ జేసీ

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులకు మూడు కేజీల బియ్యానికి బదులుగా మూడు కేజీల రాగులు అందజేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ డిపోలకు వెళ్లే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.


