News September 10, 2024
విజయవాడకు అండగా నిలిచిన నెల్లూరు

నెల్లూరు పారిశ్రామిక వేత్తలు పలువురు తమ మంచి మనసు చాటుకున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకొనేందుకు తమ వంతు సాయం అందించారు. సోమిరెడ్డి సమక్షంలో జెమినీ ఎడిబుల్ ఆయిల్స్& ఫ్యాట్ లిమిటెడ్ రూ.2కోట్లు, పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్లో మంగళవారం చంద్రబాబుకు చెక్కు అందించారు.
Similar News
News November 18, 2025
తోటపల్లి: ఇంటిని లాక్కొని బెదిరిస్తున్నారని ఫిర్యాదు.!

నల్లూరు జిల్లా తోటపల్లి గూడూరుకి చెందిన తన ఇంటిని లాక్కొని అల్లుడు బెదిరిస్తున్నారని వృద్ధుడు సోమవారం పోలీస్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. తన పెద్ద అల్లుడు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళంవేసి, ఇంటి నుంచి తరిమేసి చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. తనకు మగ పిల్లలులేరని, ఇద్దరు ఆడపిల్లలని, భార్య చనిపోయారని, విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.

News November 17, 2025
నెల్లూరు: సదరం.. నాట్ ఓపెన్..!

వికలాంగత్వ ధ్రువీకరణ కోసం తీసుకొచ్చిన “సదరం” సైట్ ఓపెన్ కావడం లేదు. ఈనెల 14 న సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. రెండు రోజులకే మూతపడింది. అదేమిటంటే ఒకసారి స్లాట్స్ అయిపోయాయని చెప్పుకొచ్చారు. వెయిటింగ్ లిస్ట్ కింద అయినా దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నం చేయగా.. సైట్ క్లోజ్ అయిపొయింది. ఇదేమి విచిత్రమని ప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి ఇవే తిప్పలు ఎదురవుతున్నాయి.