News June 15, 2024
విజయవాడకు మెట్రో రైలు?
విజయవాడకు మెట్రో రైలు ప్రాజెక్టుపై మరోసారి చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. గతంలోనే తుది డీపీఆర్ సిద్ధమైనా, వైసీపీ ప్రభుత్వం సమీక్ష చేయకపోవడంతో మూలన పడింది. రాజధాని మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం సమీక్ష సందర్భంగా ఇది కూడా చర్చకు వస్తుందని అంతా భావిస్తున్నారు.
Similar News
News September 10, 2024
రేపు విజయవాడ వరద ప్రాంతాల్లో పర్యటించనున్న మెగా హీరో
ఈ నెల 11న సినీ హీరో సాయి ధరమ్ తేజ్ విజయవాడలో పర్యటించనున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరకులు, దుప్పట్లు, బట్టలు పంపిణీ చేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. ఉదయం 11గంటలకు సింగ్‌నగర్‌లోని అమ్మసేవ ఆశ్రమాన్ని ఆయన సందర్శిస్తానని, అభిమానులు రావాలని కోరారు. ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఆయన చెరో రూ. 10 లక్షల చొప్పున విరాళం అందించిన విషయం తెలిసిందే.
News September 10, 2024
విజయవాడ: వరద ప్రభావిత ప్రాంతాల్లో దొంగలు
విజయవాడ వరద ప్రభావిత కాలనీలలో దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా బీరువాల్లోని నగదు, బంగారం, గ్యాస్ సిలిండర్లు కాజేస్తున్నారు. లూనా సెంటర్లో 10తులాల బంగారం. రూ.లక్షన్నర నగదు, వాంబే కాలనీలో 3తులాల బంగారంతో పాటు సింగ్ నగర్, తదితర ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇళ్లలోని సొత్తు కాజేశారని కంటతడి పెడుతున్నారు.
News September 9, 2024
విజయవాడ: వరద బాధితులకు రూ.కోటి విరాళం
లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ అధినేత ఎమ్.కిరణ్ కుమార్ వరద బాధితుల కోసం రూ.1 కోటి విరాళాన్ని సోమవారం అందజేశారు. సీఎం చంద్రబాబును విజయవాడ కలెక్టరేట్‌లో కలిసి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన్ను సీఎం చంద్రబాబు అభినందించి, వరద బాధితులకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని అన్నారు.