News December 11, 2024

విజయవాడకు వెళ్లిన కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు

image

కడప, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు శ్రీధర్ చెరుకూరి, శ్రీధర్ చామకూరి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

Similar News

News December 27, 2024

కడప నుంచి హైదరాబాదు, విజయవాడకు స్లీపర్ బస్సులు

image

కడప పట్టణం నుంచి హైదరాబాదు, విజయవాడ దూర ప్రాంతాలకు స్టార్ లైన్ స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో RM గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. కడప నుంచి హైదరాబాదు, విజయవాడ ప్రాంతాలకు ప్రతిరోజు రాత్రి9 గంటలకు బస్సులు బయలుదేరుతాయని వెల్లడించారు. ప్రయాణికులు సౌకర్యవంతంగా నిద్రిస్తూ ప్రయాణం చేసే విధంగా రూపొందించినట్లు వివరించారు. ప్రజలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News December 27, 2024

కడప: ఆ రైలు 2 నెలలు రద్దు

image

తిరుపతి-హుబ్లీ ప్యాసింజర్ రైలు సేవలను 28వ తేదీ నుంచి రద్దు చేసి, కుంభమేళా ఉత్సవాలకు పంపుతున్నట్లు రైల్వే అధికారి జనార్దన్ తెలిపారు. ఈ రైలు ఉమ్మడి కడప జిల్లాలోని బాలపల్లె, శెట్టిగుంట, ఓబులవారిపల్లి, పుల్లంపేట, రాజంపేట, హస్తవరం, నందలూరు, మంటపంపల్లె, ఒంటిమిట్ట, భాకరాపేట, కనుమలోపల్లి, కడప, కృష్ణాపురం, గంగాయపల్లె, కమలాపురం, ఎర్రగుడిపాడు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, మంగపట్నం, కొండాపురం మీదుగా ప్రయాణిస్తుంది.

News December 27, 2024

తాడేపల్లిలో రైల్వే కోడూరు కానిస్టేబుల్ మృతి

image

రైల్వే కోడూరు మండలానికి చెందిన 95వ బ్యాచ్, 11వ బెటాలియన్‌‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజయ్య గురువారం మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం తాడేపల్లికి వెళ్లారు. 2 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుండగా గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతను అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.