News December 11, 2024

విజయవాడకు వెళ్లిన ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు

image

ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు ఎ. తమీమ్‌ అన్సారియా, జె. వెంకట మురళి విజయవాడకు వెళ్లారు. నేడు, రేపు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న కలెక్టర్ల సదస్సులో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వ ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. అలాగే స్వర్ణాంధ్ర విజన్‌-2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకొచ్చిన పాలసీలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.

Similar News

News December 27, 2024

పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతి: కలెక్టర్

image

పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా పరిశ్రమల సంస్థ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అనుమతుల కోసం వచ్చిన 565 దరఖాస్తులలో 499 ఆమోదం పొందాయని చెప్పారు.

News December 27, 2024

బాపట్ల కలెక్టరేట్‌లో ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్

image

బాపట్ల కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఎస్టీల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ వెంకట మురళి చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీల వద్ద ఆయన అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అర్జీలను సంబంధిత అధికారులకు అందజేసి వేగంగా పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. జేసీ ప్రకార్ జైన్. ఇతర అధికారులు పాల్గొన్నారు.

News December 27, 2024

పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్‌ పకడ్బందీగా నిర్వహిస్తాం: ఎస్పీ

image

పోలీస్ కానిస్టేబుల్ ఎంపికను పకడ్బందీగా నిర్వహించాలని పోలీస్ అధికారులను ఎస్పీ దామోదర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన‌ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30 నుంచి ఒంగోలులోని పోలీసు పెరేడ్ మైదానంలో ఎంపిక ప్రారంభం అవుతుందన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన తేదీ, సమయాల్లో సర్టిఫికెట్లతో రావాలని చెప్పారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.