News March 23, 2025
విజయవాడలోని ఆ గ్రౌండ్ కోసం ట్విటర్లో చర్చ

విజయవాడ PWD గ్రౌండ్స్తో తమకు చిన్నప్పటి నుంచి ఉన్న అనుబంధాన్ని ట్విటర్లో పలువురు గుర్తు చేసుకుంటూ 2 రోజులుగా పోస్టులు పెడుతున్నారు. గత ప్రభుత్వం ఆ స్థలంలో స్మృతివనం నిర్మించడంతో ఇప్పుడు ఎగ్జిబిషన్స్, ప్లే గ్రౌండ్ ఉండటంలేదని పలువురు వాపోతుండగా.. మరికొందరు ప్రభుత్వ చర్యను సమర్థిస్తున్నారు. ఈ గ్రౌండ్స్తో మీకున్న అనుబంధాన్ని కామెంట్ చేయండి.
Similar News
News November 16, 2025
HYD: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరిపోయారు!

సైబరాబాద్ CP అవినాష్ మహంతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు వీకెండ్లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 468 కేసులు నమోదు చేశారు. 335 బైక్లు, 25 త్రీ వీలర్స్, 107 ఫోర్ వీలర్స్, ఒక హెవీ వెహికల్పైన కేసు నమోదు చేశామన్నారు. 51-100 BAC కౌంట్లో అత్యధికంగా 197 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పోలీసులు వెల్లడించారు.
News November 16, 2025
నంద్యాల: మొక్కజొన్న రైతు కుదేలు

నంద్యాల జిల్లాలో మొక్కజొన్నకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా ఎకరాకు రూ.25వేలు పెట్టుబడి పెట్టామన్నారు. ప్రకృతి సహకరించకపోవడంతో దిగుబడి ఎకరాకు 20 క్వింటాలే వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటా రూ.1800లకు కొనుగోలు చేసేందుకు ఎవరూ రావటం లేదంటున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
News November 16, 2025
ఖమ్మం: అంకుర ఆసుపత్రి ఆధ్వర్యంలో 5కే రన్

గర్భిణులు, శిశువుల ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు అంకుర ఆసుపత్రి ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సౌజన్యంతో ఆదివారం 5కే రన్ నిర్వహించారు. ఆసుపత్రి వైద్యులు డా.చల్లగుళ్ల రాకేశ్, డా.టి.శ్రీనిధి పర్యవేక్షణలో లకారం ట్యాంక్ బండ్ నుంచి ఆసుపత్రి వరకు ఈ రన్ కొనసాగింది. ఈ సందర్భంగా గర్భిణుల సంరక్షణ, నవజాత శిశువుల ఆలనా పాలనా గురించి వారు వివరించారు. ప్రముఖ టీవీ యాంకర్ రవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.


