News March 7, 2025
విజయవాడలో అగ్ని ప్రమాదానికి కారణం ఇదే..!

ఇద్దరు మహిళల మధ్య వివాదం ముదిరింది. ఆగ్రహానికి గురైన ఓ మహిళ మరో మహిళ ఇంటికి నిప్పంటించింది. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రమ్మ భర్త పౌలుతో కలిసి చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పౌలును దొంగతనాలకు వెళ్లాలని గుర్రమ్మ కోరింది. కానీ పౌలు వెళ్లకపోవడంతో దీనికి నాగమణి అనే మహిళ కారణం అని గురమ్మ కట్టర్తో దాడి చేసి ఇంటికి నిప్పంటించగా మూడిళ్లు దగ్ధమైనట్లు తెలిపారు.
Similar News
News December 9, 2025
నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.
News December 9, 2025
పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల పెంపు: DMHO

పెద్దపల్లి జిల్లా ఆరోగ్య శాఖలో జరిగిన సమీక్షలో డా. వి. వాణిశ్రీ ఆసుపత్రి ప్రసవాలను పెంచాలని, ప్రతి ఫుల్ టర్మ్ గర్భిణీని ట్రాక్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం జరిగేలా అవగాహన కల్పించాలని సూచించారు. క్షయ లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు చేయాలని ఆదేశించారు. యాంటీబయోటిక్స్ను అవసరం ఉన్నప్పుడే వాడాలని తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వారికి ఎన్సి డి స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు.
News December 9, 2025
ఈ మండలాల్లో ఎన్నికల ప్రచారం చేయవద్దు: సుర్యాపేట ఎస్పీ

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్న సూర్యపేట, ఆత్మకూర్, మద్దిరాల, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, తిరుమలగిరి ఈ మండలాలలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఎన్నికల సమయం ముగిసిందని ఎస్పీ నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా చేరవద్దని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


