News March 7, 2025

విజయవాడలో అగ్ని ప్రమాదానికి కారణం ఇదే..!

image

ఇద్దరు మహిళల మధ్య వివాదం ముదిరింది. ఆగ్రహానికి గురైన ఓ మహిళ మరో మహిళ ఇంటికి నిప్పంటించింది. పటమట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్రమ్మ భర్త పౌలుతో కలిసి చిత్తు కాగితాలు ఏరుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పౌలును దొంగతనాలకు వెళ్లాలని గుర్రమ్మ కోరింది. కానీ పౌలు వెళ్లకపోవడంతో దీనికి నాగమణి అనే మహిళ కారణం అని గురమ్మ కట్టర్‌తో దాడి చేసి ఇంటికి నిప్పంటించగా మూడిళ్లు దగ్ధమైనట్లు తెలిపారు.

Similar News

News February 9, 2026

NZB: ఈసారి ఎన్నికల్లో వీరే కీలకం..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలల్లో ప్రధాన పార్టీలకు తీసిపోకుండా స్వతంత్ర అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ప్రధాన పార్టీల నుంచి టికెట్ దక్కని వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. గతంలో స్వతంత్రులు గెలుపొంది కొన్ని చోట్ల ఛైర్మన్, మేయర్ ఎన్నికల్లో కీలకంగా మారారు. ఈసారి ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 286 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. వీరు గెలిస్తే కీలకంగా మరే అవకాశం ఉంది.

News February 9, 2026

ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాక్ షరతులు?

image

T20 WCలో INDతో మ్యాచ్‌ ఆడేందుకు ICCకి పాక్ 3 షరతులు పెట్టిందని తెలుస్తోంది. ‘రెవెన్యూలో షేర్ పెంచాలి. ఇండియాతో ద్వైపాక్షిక క్రికెట్‌ను పునరుద్ధరించాలి. హ్యాండ్‌షేక్ ప్రొటోకాల్ కొనసాగించాలి’ అని కోరిందని సమాచారం. ICC, PCB మధ్య భేటీ ముగిసిందని, 24గంటల్లో పాక్ నిర్ణయం తీసుకోనుందని క్రీడావర్గాలు తెలిపాయి. మరోవైపు ఇదే మీటింగ్‌లో తమకు పరిహారం, ఓ ICC ఈవెంట్ నిర్వహణ హక్కులివ్వాలని <<18951531>>BCB<<>> కోరినట్లు చెప్పాయి.

News February 9, 2026

గోండ్ కటిరాతో ఎన్నో లాభాలు

image

గోండ్ కటిరాలో ఉండే ప్రొటీన్ మీ కండరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, కణజాలాలను బాగు చేయడంలో సహాయపడుతుంది. ఇది శక్తిని కూడా అందిస్తుంది. గోండ్ కటిరా తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గోండ్ కటిరా తినడం వలన చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇది ముఖం పై మొటిమలను పోగొట్టడంలో, జుట్టు సమస్యలకు చికిత్స చేయడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.