News December 11, 2024
విజయవాడలో అత్యాచార నిందితుడికి శిక్ష, జరిమానా

2015లో మొఘలరాజపురంకు చెందిన ఇంటర్ చదివే బాలిక(17)ను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి రేప్ చేసిన పోతిన నాని(21)కి కోర్టు 10ఏళ్ల కఠిన కారాగార శిక్షవిధించింది. నాని ఆమెను అపహరించడంతో ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2015లో మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం పోక్సో కోర్ట్ జడ్జి వి.భవాని ఈ కేసులో తుది తీర్పు చెప్పారు. నేరం ఋజువైనందున నానికి కారాగార శిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు.
Similar News
News December 27, 2025
కృష్ణా: జోగి రమేశ్ ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యం తయారీ.!

మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో నిందితులైన అద్దేపల్లి జనార్ధనరావు, జగన్మోహనరావులను పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో శుక్రవారం వీరి ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. మాజీ మంత్రి జోగి రమేశ్ అందించిన ఫైనాన్షియల్ సపోర్ట్ తోనే నకిలీ మద్యాన్ని తయారు చేశామని నిందితులు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం.
News December 25, 2025
మచిలిపట్నం: కలెక్టరేట్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

లోకానికి ప్రేమ, శాంతి, కరుణను బోధించిన మహోన్నత వ్యక్తి ఏసుప్రభువు అని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ కొనియాడారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లోని ‘మీ కోసం’ సమావేశ మందిరంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి స్వయంగా తినిపించారు. అనంతరం అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.