News March 22, 2024

విజయవాడలో అన్నదమ్ముల మధ్య పోటీ

image

విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నిని అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. అటు వైసీపీ నుంచి కేశినేని నాని బరిలోకి దిగుతుండగా.. అన్నదమ్ముల మధ్య పోటీ ఆసక్తి నెలకొంది. కాగా 2022లో రాజకీయాల్లోకి వచ్చిన చిన్ని తొలిసారి పోటీచేస్తున్నారు. అటు గత ఎన్నికలో టీడీపీ తరఫున పోటీచేసి నెగ్గిన నాని ఈసారి వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఈ ఎన్నికలో విజయవాడలో ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Similar News

News November 17, 2024

వాడవల్లి: బాలిక పుస్తకాల సంచిలో నాగుపాము

image

ముదినేపల్లి మండలం వాడవల్లిలో బాలిక పుస్తకాల సంచిలో నుంచి పాము రావడంతో కలకలం రేపింది. గ్రామానికి చెందిన వరలక్ష్మీ కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. యథావిధిగా శనివారం పుస్తకాల సంచిని తగిలించుకుని పాఠశాలకు బయలుదేరింది. మార్గం మధ్యలో సంచిలో నుంచి శబ్దాలు రావడం గమనించిన స్నేహితురాలు చూడగా నాగుపాము కనిపించింది. దీంతో స్థానికులు దాన్ని చంపడంతో పెను ప్రమాదం తప్పింది.

News November 17, 2024

వైసీపీ నేత విద్యాసాగర్ బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ బెయిల్ కోసం వేసిన పిటిషన్‌ను విజయవాడ CID కోర్టు కొట్టివేసింది. శనివారం ఈ పిటిషన్ విచారణకు రాగా విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వవద్దని CID తరపున వాదిస్తోన్న న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విద్యాసాగర్ బెయిల్‌కై దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 

News November 17, 2024

విజయవాడ: వైసీపీని వీడేందుకు సిద్ధమైన కీలక నేత.?

image

ఎన్నికల ముందు వైసీపీలో చేరిన పోతిన మహేశ్‌ ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు విజయవాడలో ప్రచారం జరుగుతోంది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును బీజేపీకి ఇవ్వడంతో ఆయన జనసేనను వీడి వైసీపీలో చేరారు. ఎన్నికల ఫలితాల అనంతరం సెంట్రల్‌లో ఓటమిపాలైన వెలంపల్లి శ్రీనివాస్‌ను విజయవాడ పశ్చిమ ఇన్‌ఛార్జిగా వైసీపీ అధిష్ఠానం నియమించింది. దీంతో వైసీపీని వీడేందుకు మహేశ్ సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.