News July 31, 2024
విజయవాడలో కెనాల్ బోటింగ్‌కు ప్రణాళికలు

విజయవాడలోని బందరు, ఏలూరు, రైవస్ కాలువలను సుందరీకరించి కెనాల్ బోటింగ్ ఏర్పాటు చేసి సందర్శకులను ఆకర్షించాలని నగరపాలక సంస్థ(VMC) ప్లాన్ చేస్తోంది. కెనాల్ బోటింగ్ ప్రణాళిక రూపొందించాలని తాజాగా కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలిస్తే త్వరలోనే పచ్చని ప్రకృతి మధ్య కాలువలలో బోటింగ్ చేసే అవకాశం ప్రజలకు దక్కుతుంది.
Similar News
News December 16, 2025
మచిలీపట్నం: ‘అటల్-మోదీ’ బస్సు యాత్ర రూట్ మ్యాప్ ఇదే.!

నేడు మచిలీపట్నం రానున్న ‘అటల్-మోదీ’ సుపరిపాలన బస్సు యాత్ర రూట్ మ్యాప్‌ను ఆ పార్టీ నేతలు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక మూడు స్థంభాల సెంటర్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. చల్లరాస్తా సెంటర్, కోనేరుసెంటర్, బస్టాండ్, లక్ష్మీటాకీస్, డీ మార్ట్ రోడ్డు మీదుగా న్యూ హౌసింగ్ బోర్డ్ సర్కిల్‌కు చేరుకుంటుంది. వాజ్ పేయి విగ్రహావిష్కరణ అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.
News December 16, 2025
పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా అడ్డాగా మారుతోందా.?

పేకాట శిబిరాలకు కృష్ణా జిల్లా వేదికగా మారుతోందా.? అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. జూద క్రీడలు రోజు రోజుకు విస్తరిస్తుండటంమే దీనికి నిదర్శనం. పేకాట వల్ల మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. జిల్లా ఎస్పీ జూద శిబిరాలపై, యాంటీ డ్రగ్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ, కింది స్థాయి సిబ్బంది పనితీరు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
News December 16, 2025
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు

కృష్ణా జిల్లా పాఠశాలల్లో విద్యార్థుల కోసం ఆధార్ ప్రత్యేక క్యాంపులు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. నవంబర్‌లో నిర్వహించిన క్యాంపుల కొనసాగింపుగా ఈ నెల 16 నుంచి 20 వరకు, అలాగే 22 నుంచి 24 వరకు క్యాంపులు జరుగుతాయని పేర్కొంది. బయోమెట్రిక్ అప్డేట్ మిగిలి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.


