News December 21, 2024
విజయవాడలో కొత్త యాప్ తెస్తున్నాం: కలెక్టర్
అంతవరకు సరదా సరదాగా గడిపిన ఆ కుటుంబంలో ఒక్కసారిగా పెద్ద అలజడి.. తమతో పాటు ఉన్న చిన్నారి అకస్మాత్తుగా కనిపించకపోయే సరికి అంతులేని ఆవేదన. తప్పిపోయిన చిన్నారులను కనిపెట్టే సీఎంఎస్ యాప్‌ను NTR జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు శుక్రవారం తెలిపారు. విజయవాడలో డిసెంబర్ 21 నుంచి 25 వరకు జరిగే భవాని విరమణ దీక్షల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.
Similar News
News January 19, 2025
అమిత్‌షా పర్యటనకు సర్వం సిద్ధం: మంత్రి కొలుసు
కేంద్రమంత్రి అమిత్‌షా గన్నవరం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. కొండపావులూరులోని NIDM, NDRF భవనాల వద్ద ఈ మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశామని కొలుసు చెప్పారు. బహిరంగ సభ జరిగే పరిసర ప్రాంతాలు, నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాల వద్ద పోలీసు అధికారులతో కలసి ఏర్పాట్లు పర్యవేక్షించామని మంత్రి కొలుసు పేర్కొన్నారు.
News January 19, 2025
విజయవాడ: వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి
వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా వరికూటి అశోక్ బాబును నియమిస్తూ శనివారం తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా 2024 ఎన్నికలలో బాపట్ల జిల్లా వేమూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్.. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనంద్ చేతిలో పరాజయం పొందారు. కాగా అశోక్ నియామకంతో పాటు మరో 5 నియోజకవర్గాలకు నూతన సమన్వయకర్తలను వైసీపీ నియమించింది.
News January 19, 2025
నేడు అమిత్ షా ప్రారంభించనున్న NIDM పూర్తి వివరాలు
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(NIDM) దక్షిణ క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకురాగా 2015లో గన్నవరం మండలం కొండపావులూరులో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. 2018 మేలో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పాటైన ఈ కేంద్ర సంస్థ తాజాగా నిర్మాణం పూర్తి చేసుకోగా నేడు మంత్రి అమిత్‌షా లాంఛనంగా ప్రారంభించనున్నారు.