News January 11, 2026

విజయవాడలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్!

image

విజయవాడలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాచవరం సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. గిరిపురానికి చెందిన లక్కీ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు దాడి చేశామన్నారు. అతని వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతరం అతనిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు తెలిపారు.

Similar News

News January 16, 2026

PCOSకి చెక్ పెట్టే చియా సీడ్స్

image

ప్రస్తుతకాలంలో చాలామందిని బాధించే సమస్య PCOS. దీనివల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడంలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే PCOSకి చియాసీడ్స్ పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.

News January 16, 2026

KNR: మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల పోస్టర్‌ ఆవిష్కరణ

image

కరీంనగర్ జిల్లా మైనారిటీ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల పోస్టర్‌ను అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆవిష్కరించారు. 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంతో పాటు 6, 7, 8 తరగతుల్లోని మిగులు సీట్ల కోసం FEB 28లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని 9 సంస్థల్లో ఉత్తమ బోధనతో పాటు IIT/NEET శిక్షణ ఇస్తారన్నారు.పూర్తి వివరాలకు www.tgmreistelangan.cgg.gov.in సంప్రదించాలన్నారు

News January 16, 2026

MBNR:CM పర్యటన..ట్రాఫిక్ మళ్లింపు2/2

image

1.జడ్చర్ల నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలు
→SVS హాస్పిటల్ ముందు నుండి, RTC బస్టాండ్, వన్ టౌన్ చౌరస్తా మీదుగా రాయచూర్ రోడ్డు చేరుకోవచ్చు.
2.నాగర్‌కర్నూల్ నుంచి MBNR టౌన్‌లోకి వచ్చే వాహనాలు
→భూత్పూర్ ఫ్లైఓవర్ క్రింది భాగంలో లెఫ్ట్ తీసుకొని, తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి రావచ్చు.
3.కర్నూల్ నుంచి మహబూబ్‌నగర్ వచ్చే వాహనాలు
→NH-44 నందు తాటికొండ మీదుగా మహబూబ్‌నగర్ టౌన్‌లోకి ప్రవేశించవచ్చు.