News September 15, 2024
విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం

విజయవాడ రామవరప్పాడులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తల్లి కొడుకు దుర్మరణం చెందారు. ద్విచక్ర వాహనంపై నుంచి లారీ కిందపడి దుర్మరణం చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వారు విజయవాడ గుణదలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పటమట సీఐ పవన్ కిషోర్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
Similar News
News October 26, 2025
కృష్ణా: తుఫాన్ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
News October 26, 2025
కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News October 26, 2025
‘మొంథా’ తుఫాన్.. జిల్లాలో కంట్రోల్ విభాగాల ఏర్పాటు

‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాలాజీ తెలిపారు. తుఫాన్ సంబంధిత సమాచారం లేదా సహాయక చర్యల కోసం ప్రజలు ఈ కింది నంబర్‌లను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయం 08672-252572, MTM RDO 08672-252486, గుడివాడ 08674-243693, ఉయ్యూరు 08676-232589, ఈ కంట్రోల్ రూములు నిరంతరం పనిచేస్తాయని కలెక్టర్ చెప్పారు.


