News December 24, 2024
విజయవాడలో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.?
నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ “డాకు మహారాజ్” 2వ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో నిర్వహించనున్నట్లు వార్తొలుస్తున్నాయి. 2025 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ హైదరాబాద్‌లో జనవరి 2న, మొదటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో జనవరి 4న, 2వ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జనవరి 8న నిర్వహిస్తారని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. “డాకు మహారాజ్” టీం వీటిని ధృవీకరించాల్సి ఉంది.
Similar News
News January 22, 2025
ప్రకృతి వ్యవసాయం దిశగా ముందడుగు వేయాలి: కలెక్టర్
సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించి, ఆదాయం పెంచే లక్ష్యంతో పొలం పిలుస్తోంది పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంతో రైతులను చేయిపట్టి నడిపిస్తోందని కలెక్టర్ జి.లక్ష్మీశ సూచించారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండలం, దాములూరులో నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఎలా ఉంది.? సాగుచేస్తున్న పంటలు గురించి అడిగి తెలుసుకున్నారు.
News January 22, 2025
దుర్గగుడి ప్రధానార్చకులు మృతి
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో దుర్గగుడిలో చాలా సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న ప్రధానార్చకులు లింగంభొట్ల బద్రీనాథ్ బాబు మరణించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఆలయ అర్చకులు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. అనారోగ్య రీత్యా మరణించినట్లు సమాచారం.
News January 22, 2025
జి.కొండూరు: ప్రేయసి వెళ్లిపోయిందని సూసైడ్
ఇద్దరు పిల్లలున్న ప్రేయసి కాదన్నదని జి.కొండూరులోని చెర్వుమాధవరానికి చెందిన ఇద్దరు పిల్లలకు తండ్రైన ఆటోడ్రైవర్ బాలాజీ (26) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. మృతుడు మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో ప్రేయసిని అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ మహిళ ఇకపై కలవడం కుదరదని వెళ్లిపోయింది. మనస్తాపంతో ఆటో స్టార్ట్ చేసే తాడుతో ఉరివేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదుతో మైలవరం సీఐ దర్యాప్తు చేపట్టామన్నారు.