News March 23, 2025

విజయవాడలో దుమారం రేపుతున్న బ్యానర్

image

విజయవాడ మొగల్రాజపురంలోని జమ్మి చెట్టు సెంటర్ వద్ద జగన్ ఫోటోతో వినూత్నంగా ఓ బ్యానర్ వెలిసింది. వైఎస్ జగన్ ఫోటోను వేసి కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. బ్యానర్ తొలగించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ బ్యానర్ విజయవాడలో దూమారం రేపుతోంది.

Similar News

News March 31, 2025

VJA: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

image

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు పేర్కొన్నారు.

News March 30, 2025

పండగలు మన దేశ సంస్కృతిలో భాగం – CM

image

పండగలు భారతదేశ సంస్కృతిలో భాగమని సీఎం చంద్రబాబు అన్నారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో నిర్వహించిన ఉగాది సంబరాల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమాజ బాగు కోసం తపనపడే వ్యక్తి అని కితాబు ఇచ్చారు. ట్రస్ట్ నడపడం అంటే సాధారణ విషయం కాదని, స్వర్ణ భారత్ ట్రస్ట్ యువతలో స్ఫూర్తిని నింపుతోందన్నారు.

News March 30, 2025

విజయవాడ దుర్గమ్మ ప్రసాదంలో మేకు

image

విజయవాడ ఇంద్ర కీలాద్రి అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అమ్మవారి ప్రసాదంలో మేకు వచ్చిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. భక్తుల వివరాల మేరకు.. కొందరు భక్తులు శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. అనంతరం వారు మహా మండపం కింద 4 వ ప్రసాదం కౌంటర్‌లో పులిహోర పొట్లాలు కొనుగోలు చేశారు. వారు ప్రసాదం తింటుండగా మేకు రావడంతో అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!