News July 22, 2024
విజయవాడలో నిత్య పెళ్లికొడుకు అరెస్ట్

మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో మారు పేర్లతో ప్రొఫైల్ అప్‌లోడ్ చేసుకొని ఒంటరి మహిళలకు వల వేసిన నిత్య పెళ్లికొడుకును గవర్నర్ పేట పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణకు చెందిన మోహన్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తానంటూ పలు మ్యాట్రిమోనీ సైట్లలో ఒంటరి మహిళలను మోసం చేసి నగదు వసూలు చేసి పారిపోయేవాడు. పలు ఫిర్యాదులు రావడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు.
Similar News
News November 19, 2025
కృష్ణా: నేడే రైతుల ఎకౌంట్లలో రూ.7వేలు జమ

పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రైతులకు పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.7వేలు నగదు నేడు జమకానుంది. జిల్లాలో 1,33,856 మంది రైతుల ఖాతాల్లో రూ.88.49కోట్లను 2వ విడత సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేయనున్నాయి. అన్నదాత సుఖీభవ కింద రూ.66.93కోట్లు, పీఎం కిసాన్ కింద రూ.21.56కోట్లు జమ కానున్నాయి. తొలి విడత సాయాన్ని గత ఆగస్ట్ నెలలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
News November 19, 2025
కృష్ణా జిల్లాలో ఏడుగురు ఎస్ఐల బదిలీ

జిల్లాలో ఏడుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. VRలో ఉన్న కెవై దాస్‌ను చల్లపల్లి SIగా, నాగ శివనాధ్‌ను DCRB SIగా బదిలీ చేశారు. చల్లపల్లి SI PSV సుబ్రహ్మణ్యం ఇనగుదురు SI-1గా, కోడూరు SI శిరీషను కూచిపూడి SIగా, ఇనగుదురు SI-1 YVV సత్యనారాయణను DTC పెదవేగి ఏలూరు జిల్లాకు, గుడివాడ వన్ టౌన్ SI గౌతమ్ ను అవనిగడ్డ SI-2గా బదిలీ చేస్తూ SP విద్యాసాగర్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.