News March 16, 2025

విజయవాడలో నేటి నెన్‌వెజ్ ధరలివే.! 

image

విజయవాడలో చికెన్ ధరలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం స్కిన్‌లెస్ కిలో ధర రూ.180గా ఉండగా స్కిన్ రూ.170గా కొనసాగుతుంది. అలాగే కోడిగుడ్లు మాత్రం గత వారంతో పోలిస్తే పెరిగింది. గుడ్లు గత వారం రూ.138 ఉండగా నేడు రూ.144లకు పెరిగింది. ఇలాగే విజయవాడలో కేజీ రూ.180 ఉన్న చేపల ధర రూ.220లకు పెరిగింది. కేజీ మటన్ రూ.900లుగా కొనసాగుతోంది. 

Similar News

News February 26, 2026

గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం: జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్

image

మహాత్మా జ్యోతిబా ఫూలే సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 5, 6,7,8 తరగతులు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని పల్నాడు జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ పి. పరమేశ్వరరావు కోరారు. పల్నాడు జిల్లాలో దాచేపల్లి, సత్తెనపల్లి, వినుకొండ, నరసరావుపేట స్కూళ్లల్లో ప్రవేశ అర్హులైన అభ్యర్థులు ఈనెల 4 నుంచి మార్చి 3 వరకు https://mjpapbcwreis.apcfss.in/ వెబ్సైట్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News February 26, 2026

MHBD జిల్లా పగ్గాలు.. దంపతుల చేతుల్లో!

image

జిల్లా పాలనలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటికే ఇక్కడ ఎస్పీగా అద్భుత సేవలు అందిస్తున్న భర్త శబరీశ్ తోడుగా, ఆయన భార్య స్నేహ శబరీశ్ నేడు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఒకే జిల్లాలో భార్యాభర్తలు ఇలాంటి కీలక పదవుల్లో ఉండటం అత్యంత అరుదైన విషయం. వీరిద్దరి మధ్య ఉండే సమన్వయం వల్ల ఇక నుంచి జిల్లాలో శాంతి భద్రతలతో పాటు అభివృద్ధి పరంగా దూసుకెళ్లనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News February 26, 2026

వెలుగుమట్ల భూదాన్ భూములపై కలెక్టర్ వివరణ

image

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల అంశంపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం వివరణ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. లంచ్ మోషన్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించిందన్నారు. సుమారు రూ.250 కోట్ల విలువైన భూమిని రక్షించామని, అర్హులైన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.