News April 6, 2025

విజయవాడలో నేడు చికెన్ ధరలు ఇవే.! 

image

విజయవాడలో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.310 ఉండగా నేడు రూ.270గా ఉంది. అలాగే స్కిన్ రూ.260లుగా ఉంది. చేపల ధరలు గత వారంతో పోలిస్తే కేజీకి రాగండి రూ.20లు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. రాగండి కిలో రూ.220గా ఉన్నట్లు రిటైల్ వ్యాపారులు చెప్పారు. మటన్ కిలో రూ.1000 యథావిధిగా ఉంది. మీ ఊరిలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో.. COMMENT చేయండి.

Similar News

News April 17, 2025

ఖమ్మం: ఇద్దరు పిల్లలను నరికి తల్లి SUICIDE

image

హైదరాబాద్ జీడిమెట్ల PS పరిధిలో దారుణం జరిగింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వివాహిత తేజ(30) గాజులరామారంలో ఉంటుంది. వేట కొడవలితో ఇద్దరు కొడుకులను నరికి, ఆనక తల్లి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో 7, 5 ఏళ్ల పిల్లలను కిరాతకంగా నరికి చంపిందని స్థానికులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.

News April 17, 2025

కర్నూలు: సీనియర్ సిటిజన్ ఐడీకి ఆన్‌లైన్‌‌ దరఖాస్తులు 

image

జిల్లా వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వయో వృద్ధుల సంక్షేమశాఖ అధికారి రయిస్ ఫాతిమా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 58 ఏళ్లు పైబడిన మహిళలు సీనియర్ సిటిజన్లు అర్హులన్నారు. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్, పాసుపోర్టు సైజు ఫొటోతో వార్డు, గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 17, 2025

భూభారతిపై మేడ్చల్ కలెక్టర్ సమావేశం

image

ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం ద్వారా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం అన్నారు. కలెక్టరేట్‌లో భూభారతిపై తహాశీల్దార్లు, జిల్లా రెవెన్యూ అధికారులకు అవగాహన కల్పించేందుకు అదనపు కలెక్టరు విజయేంధర్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు.

error: Content is protected !!