News April 13, 2025

విజయవాడలో నేడు చికెన్ ధరలు ఇవే..

image

విజయవాడలో గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కేజీ స్కిన్‌లెస్ చికెన్ రూ.270 ఉండగా నేడు రూ.220గా ఉంది. అలాగే స్కిన్ రూ.210లుగా ఉంది. చేపల ధరలు గత వారంతో పోలిస్తే కేజీ రాగండి రూ.20లు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. రాగండి కిలో రూ.220గా ఉన్నట్లు రిటైల్ వ్యాపారులు చెప్పారు. మటన్ కిలో రూ.1000 యథావిధిగా ఉంది. 

Similar News

News October 17, 2025

జగన్‌పై దుమ్మెత్తడానికి మాత్రం పవన్ ఊపుకుంటూ వస్తాడు: పేర్ని నాని

image

కల్తీ మద్యంతో అడ్డగోలు దోపిడీ జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. ‘ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా నిద్రపోతున్నారా? గతంలో జగన్ మద్యపాన ప్రియుల కడుపు కొట్టాడని ఊగిపోయిన పవన్ ఇపుడు నోరెత్తే ధైర్యం చేయడం లేదు. అబద్ధాలను జగన్‌కు అంటించడానికి మాత్రం ఊపుకుంటూ వస్తాడు’ అని ఎద్దేవా చేశారు. కల్తీ పాపాన్ని YCPకి అంటించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

News October 17, 2025

రుణాల రికవరీపై దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

బ్యాంకుల నుంచి రుణాలు అందజేయడం చేస్తూనే మరో వైపు ఇచ్చిన రుణాలను రికవరీ చేయించడం కూడా అధికారుల ప్రధాన కర్తవ్యమని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రుణాలను అందజేయడానికి బ్యాంకులు ఆసక్తి చూపాలని, అప్పుడే పథకాలు విజయవంతంగా నడుస్తాయని అన్నారు. అదే సమయంలో రుణాల రికవరీపై దృష్టి పెట్టాలన్నారు.

News October 17, 2025

పోషణ మాసం ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న MLA, కలెక్టర్

image

తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఐడీవోసీ కార్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన పోషణ మాస ముగింపు ఉత్సవాల్లో కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోషణ మాసంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాకు నాలుగో స్థానం లభించడం పట్ల శిశు సంక్షేమ శాఖ సిబ్బందిని అభినందించారు.