News March 6, 2025
విజయవాడలో నేడు నారా భువనేశ్వరి పర్యటన

విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రానున్నారు. స్టెల్లా కాలేజ్ సమీపంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవనానికి నేడు ఉదయం ఆమె భూమి పూజ చేయనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆంధ్రాలో కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ మేరకు అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News December 12, 2025
కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: KTR

TG: పంచాయతీ ఎన్నికల్లో సగం స్థానాలు కూడా గెలవకపోవడం, అనేకచోట్ల 10, 20 ఓట్లతో బయటపడటం చూస్తుంటే కాంగ్రెస్ కౌంట్‌డౌన్ పల్లెల నుంచే మొదలైనట్లు అర్థమవుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలిపారు. వచ్చే మూడేళ్లు ఆ పార్టీ అధికారంలో ఉన్నా పైసా అభివృద్ధి జరగదని ప్రజలు డిసైడ్ కావడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, రానున్న రోజుల్లో INC పాతాళానికి పడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
News December 12, 2025
ఆసుపత్రుల పారిశుద్ధ్యంపై కలెక్టర్ సమీక్ష

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఏ.సిరి ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, శుభ్రత సేవల పర్యవేక్షణపై ఆమె ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పారిశుద్ధ్య ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 12, 2025
గుంతకల్లులో నంచర్ల యువకుడి దారుణ హత్య

చిప్పగిరి(M) నంచర్లకు చెందిన యువకుడు చంద్రశేఖర్ అనంత(D) గుంతకల్లులో దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన గుంతకల్లులోని ఆదర్శ నగర్లో ఉంటున్నాడు. శుక్రవారం కుళాయి వద్ద నీటి కోసం చంద్రశేఖర్, పక్కింటి శివకు మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ను శివ కొడవలితో నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది.


