News March 24, 2025

విజయవాడలో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం 

image

విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్‌చంద్ర తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యహ్నం ఒంటి గంట వరకు విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యలు దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ధ్యాన్‌చంద్ర కోరారు. 

Similar News

News December 5, 2025

వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: సీఎం చంద్రబాబు

image

AP: పిల్లలు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని CM చంద్రబాబు ఉపాధ్యాయులు, పేరెంట్స్‌కు చెప్పారు. పార్వతీపురం మన్యం(D) భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో CM పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించి అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాది వేయాలని సూచించారు.

News December 5, 2025

సికింద్రాబాద్‌: ‘పుష్ప’ స్టైల్లో హవాలా డబ్బు రవాణా

image

సికింద్రాబాద్‌లో ‘పుష్ప’ సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్నారు. దీంతో 15 కిలోమీటర్లు బోయిన్‌పల్లి పోలీసులు సాహసోపేతంగా ఛేజ్ చేసి ముఠాను అడ్డగించారు. కార్ డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో దాచిన భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఛేజ్ చేసి పట్టుకున్న ఈ హవాలా గ్యాంగ్‌ రూ.కోట్లు తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 5, 2025

క్షమాపణ కోరిన రంగనాథ్

image

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైకోర్టుకు హాజరయ్యారు. బతుకమ్మ కుంట వివాదంలో న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణ కోరారు. ఆ స్థలంలో యథాతథస్థితి కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులివ్వగా రంగనాథ్ ఉల్లంఘించారంటూ సుధాకర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించినా కమిషనర్ వెళ్లలేదు. దీంతో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించడంతో రంగనాథ్ కోర్టుకు వెళ్లారు.