News March 24, 2025
విజయవాడలో నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం

విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ధ్యాన్‌చంద్ర తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యహ్నం ఒంటి గంట వరకు విజయవాడ నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యలు దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ధ్యాన్‌చంద్ర కోరారు.
Similar News
News April 24, 2025
భీమవరంలో యాంకర్ అనసూయ సందడి

భీమవరంలో సినీనటి అనసూయ సందడి చేశారు. గురువారం భీమవరంలోని ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ఆమె వచ్చారు. అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. భీమవరం చాలా సార్లు వచ్చానని, ఇక్కడ అభిమానం ఎప్పటికీ మరవలేనని, ఎన్నిసార్లు అయినా భీమవరం వస్తానని అనసూయ అన్నారు.
News April 24, 2025
మైలవరం: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

మైలవరానికి చెందిన యువకుడు అవినాశ్ తెనాలిలో ఏడవ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తెనాలి వన్ టౌన్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు స్కూల్లో 7వ తరగతి చదువుతున్న బాలికకు అవినాశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. ఇటీవల తెనాలి వచ్చిన అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.