News December 30, 2024

విజయవాడలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక 

image

కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో కూడా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. 

Similar News

News January 14, 2025

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న థమన్, బాబీ

image

“డాకుమహారాజ్” చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు థమన్ మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బాబీతో కలసి అమ్మవారిని దర్శించుకున్నానని థమన్ తన ఇన్‌స్టా ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు. కాగా 2025 సంక్రాంతికి వీరిద్దరూ పనిచేసిన “డాకుమహారాజ్” థియేటర్లలో సందడి చేస్తోంది. 

News January 14, 2025

కృష్ణా: కోజాకు బలే గిరాకీ రూ.3వేలు

image

కోడి పందేల బరుల వద్ద పోరాడి ఓడిన పుంజు మాంసంపై డిమాండ్ అమాంతం పెరిగింది. కోజాగా వ్యవహరించే ఈ కోడిని ఉమ్మడి కృష్ణా జిల్లాలో పలుచోట్ల కొనుగోలుదారులు రూ.2 నుంచి రూ.3వేలు పెట్టి కొన్నారు. ఇదే అదనుగా భావించిన స్వార్థపరులు పెరటి కోడి పుంజులను తక్కువకు కొనుగోలు చేసి బ్లేడ్లతో గాట్లు పెట్టి కాల్చి అధిక ధరలకు అమ్మకాలు జరిపారు. 

News January 14, 2025

కంకిపాడులో కోడిపందేల శిబిరం వద్ద ఘర్షణ

image

కంకిపాడు కోడిపందేం శిబిరం వద్ద సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. వణుకూరు-పునాదిపాడు యువకులు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. బీర్ సీసాలతో వీరంగం సృష్టించారు. ఓ వ్యక్తి తల పగిలింది. స్థానికులు వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తి కంకిపాడు పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. కాగా పోలీసులు కోడిపందేల శిబిరానికి పర్మిషన్ ఇవ్వడంపై ప్రజలు మండిపడుతున్నారు.