News December 28, 2024
విజయవాడలో ప్రారంభమైన తెలుగు మహాసభలు
ప్రపంచ 6వ తెలుగు మహాసభలు శనివారం విజయవాడలోని KBN కాలేజీలో ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాలకు నిర్వాహకులు 3 సభావేదికలు సిద్ధం చేశారు. సుప్రీం కోర్టు మాజీ CJI ఎన్వీ రమణ, ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవిదేశాల నుంచి 1500 మందికిపైగా కవులు, రచయితలు ఈ సభలకు తరలివచ్చారు.
Similar News
News January 20, 2025
విజయవాడలో యువకుడి ఆత్మహత్య
విజయవాడ నగరంలోని రాధనగర్‌లో శనివారం వాచ్‌మెన్ గొర్లి శివ (25) ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. నున్న పోలీసులు తెలిపిన వివరాల మేరకు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న శివను యజమాని పిలువగా పలకలేదు. తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి స్థానికుల సాయంతో తలుపు తెరచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
News January 20, 2025
విజయవాడ మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
మహా కుంభమేళాకు వెళ్లే వారి కోసం విజయవాడ మీదుగా తిరుపతి- బనారస్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.07107 తిరుపతి- బనారస్ రైళ్లను 2025 ఫిబ్రవరి 8, 15, 22 తేదీలలో నడుపుతున్నామని తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News January 19, 2025
విజయవాడ: దేవాలయాలపై చట్ట సవరణ చేయాలని వినతి
ఇటీవల విజయవాడ సమీపంలో హైందవ శంఖారావం కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. నేడు ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను VHP కేంద్రీయ ఉపాధ్యక్షుడు గంగరాజు, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, రాష్ట్ర కోశాధికారి దుర్గాప్రసాద్ రాజు విజయవాడలో కలిశారు. ఇటీవల నిర్వహించిన హైందవ శంఖారావ సభ వివరాలను అమిత్ షాకు అందించారు. కేంద్ర ప్రభుత్వం దేవాలయాల స్వయం ప్రతిపత్తి కొరకు చట్ట సవరణ చేయాలని కోరారు.