News February 5, 2025
విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం

విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లేడ్ బ్యాచ్ ముఠా వీరంగం సృష్టించారు. ఇద్దరు యువకులపై బ్లేడు బ్యాచ్ దాడి చేయడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బక్కి అనే అనే వ్యక్తి ఇద్దరిపై బ్లడ్‌తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏలూరు ఆసుపత్రికి తరలించి.. దాడికి పాల్పడ్డ బక్కిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News January 18, 2026
అనకాపల్లి: విషాదం.. పెళ్లైన ఏడాదికే వివాహిత ఆత్మహత్య

అనకాపల్లి పరిధిలోగల శారదానదిలోకి దూకి వివాహిత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. అనకాపల్లి సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన భారతి(19)కి వివాహం జరిగి ఏడాది అయింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 18, 2026
ట్రంప్ వద్దకు నోబెల్ శాంతి.. స్పందించిన కమిటీ

ట్రంప్‌నకు వెనిజులాకు చెందిన మచాడో తన <<18868941>>శాంతి<<>> బహుమతిని ఇవ్వడంపై భిన్నమైన స్పందన రాగా తాజాగా నోబెల్ కమిటీ స్పందించింది. మెడల్ ఎవరి వద్ద ఉన్నా తాము ప్రకటించిన విజేతలో మార్పు ఉండదని తెలిపింది. విజేతలు తీసుకునే నిర్ణయాలపై అవార్డు కమిటీ ఎలాంటి కామెంట్లు చేయబోదని పేర్కొంది. మెడల్‌ను అమ్మడం, దానం చేయడం వంటి వాటిపై పరిమితులు లేవని తెలిపింది. గతంలోనూ పలువురు మెడల్స్‌ను డొనేట్/అమ్మడం చేసినట్లు వెల్లడించింది.
News January 18, 2026
NGKL జిల్లాలో 1,403 టన్నుల యూరియా నిల్వలు

NGKL జిల్లాలో 1,403 టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెలలో మరో 4,349 టన్నుల యూరియా జిల్లాకు కేటాయించినట్లు తెలిపారు. ఈ యాసంగిలో రైతులకు ఇప్పటివరకు 1.44 లక్షల బస్తాల యూరియా అధికంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. మొక్కజొన్న పంట సాగుచేసిన రైతులందరికీ దాదాపు యూరియా పంపిణీ చేయడం జరిగిందన్నారు.


