News February 7, 2025
విజయవాడలో భారీ దొంగతనం

విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ.2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు.
Similar News
News December 1, 2025
పాలమూరు: రక్తపింజర పాముతో జాగ్రత్త

రక్తపింజర పాము విషం రక్త ప్రసరణ వ్యవస్థపై పనిచేసి, కరిచిన భాగం వాచిపోతుందని, తక్షణ చికిత్స తీసుకోకపోతే రక్తనాళాలు చిట్లిపోయి ప్రాణాపాయం ఉంటుందని స్నేక్ క్యాచర్ సదాశివయ్య హెచ్చరించారు. ప్రజలందరూ ఈ పాము పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కనిపిస్తే వెంటనే 9963536233 నంబర్కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
News December 1, 2025
ఆఖరి రాగం పాడేద్దామా..!

చూస్తుండగానే 2025లో డిసెంబర్ వచ్చేసింది. 30 రోజులు ఆగితే చివరి పేజీ కూడా చిరిగిపోతుంది. 2025ను సెల్ఫ్ రివ్యూ చేసుకుంటే.. ఎన్నో జ్ఞాపకాలు, ఘటనలు, గుణపాఠాలు. కొన్ని స్వీట్గా, కొన్ని ఘాటుగా, ఇంకొన్ని కాస్త కాస్ట్లీ. మిక్చర్ ప్యాకెట్ లాంటి మిక్స్డ్ ఫీల్ ఇయర్లో మీ బెస్ట్ ప్లేస్, మెమొరి, బ్యాడ్ డే.. ఇలా డైలీ ఓ విషయం షేర్ చేసుకుందాం. ఈ ఇయర్కు ఇలా ఆఖరి రాగం పాడేద్దాం!
రోజూ 7pmకు స్పెషల్గా కలుద్దాం.
News December 1, 2025
జిల్లాలో నేటి నుంచి పోలీసు యాక్ట్ అమలు: సంగారెడ్డి ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా నేటి నుంచి 31 రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.


