News February 7, 2025

విజయవాడలో భారీ దొంగతనం

image

విజయవాడ శివారు ఎనికేపాడులో భారీ దొంగతనం జరిగింది. పటమట పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ఎనికేపాడులోని ఐఫోన్ గోడౌన్‌ రేకు పగలకొట్టి గుర్తుతెలియని దుండగులు రూ.2.50కోట్ల విలువైన 372 ఐఫోన్లు చోరీ చేసినట్లు గుర్తించారు. మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. 

Similar News

News April 18, 2026

ప్లాస్టిక్ పూల విక్రయాలు అనుమతించం: మంత్రి తుమ్మల

image

రాష్ట్రంలో ప్లాస్టిక్ పూల విక్రయాలను అనుమతించబోమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. రైతు మేళాలో రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో మార్కెటింగ్ శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మార్కెట్లు, రైతుబజార్లలో ప్లాస్టిక్ పూల అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని, సహజ పూల విక్రయాలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

News April 18, 2026

భారత నౌకలపై IRGC కాల్పులు!

image

హార్ముజ్‌‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత నౌకలపై IRGC కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అందులో ఒకటి 20 లక్షల బ్యారెళ్ల ఇరాక్ ఆయిల్‌తో వెళ్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ రెండు భారత షిప్పులు హార్ముజ్ నుంచి తిరిగి వెనక్కి వెళ్లిపోయాయని తెలిపింది. నౌకలతో పాటు అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి భారత ప్రభుత్వం సమన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది.

News April 18, 2026

MNCL: రేపు మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు.. ఏర్పాట్లు పూర్తి

image

జిల్లాలో ఈ నెల 19న జరగనున్న తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, 7 నుంచి 10వ తరగతులలో మిగులు సీట్లకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్ టికెట్‌లను telanganams.cgg.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.