News April 22, 2025

విజయవాడలో మృతదేహం కలకలం

image

విజయవాడ కస్తూరిబాయిపేటలో సోమవారం సాయంత్రం మృతదేహం కలకలం రేపింది. సూర్యారావుపేట పోలీసుల వివరాల ప్రకారం.. బోసు బొమ్మ సెంటర్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడన్న సమాచారం మేరకు పరిశీలించామన్నారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 మధ్య ఉంటుందని చెప్పారు. ఈ వ్యక్తి ఎవరికైనా తెలిస్తే సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో సంప్రదించాలి అన్నారు.

Similar News

News April 22, 2025

సివిల్స్ ర్యాంక్ కొట్టిన షాద్‌నగర్ యువతి

image

UPSCలోనూ మన రంగారెడ్డి జిల్లా వాసులు రాణించారు. షాద్‌నగర్‌లోని టీచర్స్‌కాలనీకి చెందిన రాఘవేందర్ రావు కుమార్తె ఇంద్రార్చిత కొంతకాలంగా సివిల్స్‌‌‌కు ప్రిపేర్ అవుతోంది. తాజాగా విడుదలైన UPSC ఫలితాల్లో 739 ర్యాంక్ సాధించింది. పట్టుదలతో చదివి ర్యాంక్ సాధించడం పట్ల షాద్‌నగర్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఆల్ ఇండియాలో రంగారెడ్డి జిల్లా యువత మెరుగైన ఫలితాలు సాధించడం విశేషం.

News April 22, 2025

MHBD: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మోడల్ కాలేజ్ విద్యార్థులు

image

ఇంటర్ పరీక్షల ఫలితాల్లో మోడల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఫలితాలతో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో నిలిచారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులలో బి.సాయి సుష్మ 462/470 (ఎంపీసీ), జె.మధుమిత 426/470(బైపీసీ), ఏ.శ్రీలక్ష్మి 447/500( సీఈసీ), విద్యార్థులను ప్రిన్సిపల్ జి.ఉపేందర్ రావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

News April 22, 2025

విపత్తులతో ఏ ఒక్కరూ చనిపోకూడదు: అనిత

image

AP: ప్రకృతి విపత్తుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరి ప్రాణాలు పోవడానికి వీల్లేదని హోంమంత్రి అనిత అన్నారు. దీనిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ‘గత ప్రభుత్వం వంతెనలు, డ్రైనేజీలు, సాగునీటి ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో విపత్తులు సంభవిస్తున్నాయి. ఇకపై ఇలాంటివి సంభవించకుండా జాగ్రత్త పడతాం’ అని ఆమె వ్యాఖ్యానించారు.

error: Content is protected !!