News September 5, 2024

విజయవాడలో మెరుగవుతున్న ప్రజా జీవనం

image

బుడమేరు వరదతో అల్లకల్లోలంగా మారిన విజయవాడ నగరం క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. వరద ప్రవాహం తగ్గడంతో గురువారం సాయంత్రం అజిత్ సింగ్ నగర్ పైవంతెనపైకి వాహనాల రాకపోకలను ప్రభుత్వం యంత్రాంగం అనుమతించింది. నగరంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరా సైతం పునరుద్ధరణ జరగడంతో అక్కడి ప్రజలు సహాయ కేంద్రాల నుంచి తమ నివాసాలకు వెళుతున్నారు.

Similar News

News November 14, 2025

కృష్ణా: 30 మంది జెడ్పీ ఉద్యోగులకు పోస్టింగ్

image

గత 6 నెలలుగా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జెడ్పీ ఉద్యోగుల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు వారికి పోస్టింగ్‌లు ఇస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2024 జూన్‌లో జెడ్పీ ఉద్యోగుల బదిలీలు జరిగాయి. కౌన్సిలింగ్ ద్వారా 30 మంది ఉద్యోగులు జెడ్పీకి వచ్చారు. అయితే వీరికి సీట్ల కేటాయింపులో తీవ్ర జాప్యం జరిగింది. ఎట్టకేలకు వీరందరికీ ఉన్నతాధికారులు సీట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 14, 2025

కృష్ణా: పొలాల్లో తగ్గని వర్షపు నీరు.. కుళ్లిపోతున్న వరి పనలు

image

మొంథా తుపాన్ బారిన పడిన రైతాంగం నేటికీ కోలుకోలేని పరిస్థితి కృష్ణా జిల్లాలో నెలకొంది. తుపాన్ ప్రభావం తగ్గి 20 రోజులు గడుస్తున్నా నేటికీ కొన్ని ప్రాంతాల్లో పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీరు తగ్గకపోవటంతో దాని ప్రభావం దిగుబడులపై చూపుతోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వర్షపు నీటిలో వరి పనలు నానిపోవడంతో ధాన్యపు కంకులు కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 14, 2025

కృష్ణా: రేపటి నుంచి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ

image

మహిళలకు రేపటి నుంచి స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రం జిల్లా మేనేజర్ ఎస్. జుబేదా పర్వీన్ శుక్రవారం తెలిపారు. పామర్రు (M) నిమ్మకూరు ఎన్టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత కేంద్రంలో 18-35 వయసు కలిగిన మహిళలకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్ బ్యూటీ తెరపిస్ట్, జనరల్ డ్యూటీ నర్సింగ్ అసిస్టెంట్, మగ్గం వర్క్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.