News January 25, 2025
విజయవాడలో మ్యూజికల్ నైట్ ఏర్పాట్లు

విజయవాడలో ఇఫ్టోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 15న నిర్వహించే ఈ మ్యూజికల్ నైట్లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొననున్నారు. ఈ ఏర్పాట్లను ఇందిరా గాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి శుక్రవారం సీపీ రాజశేఖర్ బాబుతో కలిసి పరిశీలించారు.
Similar News
News November 14, 2025
సతీష్ ఈరోజు విచారణకు రావాల్సి ఉంది?.. ఇంతలోనే..

తిరుపతి పద్మావతి అతిథి గృహంలో జరుగుతున్న పరకామణి కేసు సీఐడీ విచారణకు రెండోసారి మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ శుక్రవారం రావాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గుంతకల్ రైల్వే డివిజన్లో పని చేస్తున్న సతీష్.. తిరుపతి విచారణకు వచ్చే క్రమంలో ఈ <<18284097>>అనుమానాస్పద మృతి<<>> పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఓ విజిలెన్స్ అధికారి, సీఐను సీఐడీ బృందం విచారణ చేస్తుంది.
News November 14, 2025
అనధికార షాపులను తొలగించాలి: ఈవో వెంకట్రావు

యాదాద్రి ఆలయ పరిసరాల్లో ప్రైవేట్ ప్రకటనలు, ఫ్లెక్సీలను, అనధికారిక షాపులను నిషేధించి, కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఆలయ భూములు కబ్జాకు గురికాకుండా కాంపౌండ్ వాల్, బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. టెండర్లు పారదర్శకంగా నిర్వహించాలని, దుకాణాల వద్ద ధరల వివరాలు తప్పక ఉంచాలని స్పష్టం చేశారు. సేవాభావంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.
News November 14, 2025
పోలీస్ మైదానం పనులు పరిశీలించిన ఎస్పీ శ్రీనివాసరావువాస రావు

పోలీస్ కార్యాలయం ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ మైదానం పనులను ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుక్రవారం పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మైదానం నిర్మాణాన్ని వేగవంతం చేసి, పోలీస్ సిబ్బంది వినియోగానికి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ మైదానం సిబ్బంది శారీరక దారుఢ్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.


