News September 15, 2024
విజయవాడలో రాత్రివేళ పర్యటించిన మంత్రి

విజయవాడ అజిత్ సింగ్ నగర్ పాయకాపురం నున్న పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి వేళ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్వయంగా పర్యటించారు. స్థానిక ప్రజలని కలిసి స్వయంగా మాట్లాడి ఆందోళన చెందవద్దని తెలిపారు. బుడమేరుకు వరద అంటూ ప్రచారం చేసిన ఆకతాయిలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బుడమేరుకు ఎటువంటి వరద రాదని ప్రజలు అధైర్యం పడవద్దని అన్నారు.
Similar News
News November 23, 2025
కృష్ణా: బెల్టు షాపులపై ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్.!

గ్రామస్థాయిలో బెల్టు షాపు కనిపిస్తే ‘బెల్టుతీస్తా’ అన్న ప్రభుత్వ ఆదేశాలు జిల్లాలో ఎక్కడా కనిపించడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్ షాప్ నిర్వాహకులే నేరుగా మద్యం డోర్ డెలివరీ ప్రారంభించడంతో బెల్టు వ్యాపారం అడ్డదారులు వేస్తూ దూసుకుపోతోందని సమాచారం. ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లాలోనే మద్యం ఏరులై పారుతుంటే, ఆ శాఖ అధికారులు ఈ దందాలో భాగస్వాములా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
News November 23, 2025
మచిలీపట్నం: నాన్ వెజ్కు రెక్కలు.!

కార్తీక మాసం ముగియటంతో జిల్లాలో మాంసపు దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. నెల రోజులపాటు మాంసాహారానికి దూరంగా ఉన్న ప్రజలు ఆదివారం మార్కెట్కు వెళ్లి తమకు ఇష్టమైన మాంసాహారం (చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు) కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల పాటు తగ్గిన మాంసాహారాల ధరలు ఆదివారం ఆమాంతం పెరిగిపోయాయి. కేజీ మటన్ రూ.900, చికెన్ రూ. 220, రొయ్యలు రూ.400ల వరకు అమ్ముతున్నారు.
News November 23, 2025
నేడు మచిలీపట్నంలో సత్యసాయి జయంతి వేడుకలు: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి వేడుకలను ఈనెల 23వ తేదీన జిల్లాలో అధికారిక వేడుకగా నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి కార్యాలయం వద్ద సాయంత్రం 5 గంటలకు జిల్లాస్థాయి వేడుకను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వేడుకల్లో బాబావారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ కోరారు.


