News December 28, 2024
విజయవాడలో రామ్ చరణ్ 256 అడుగుల కటౌట్
విజయవాడలో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ కటౌట్ నిర్మించారు. ఈ కటౌట్ ను రేపు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గేమ్ చేజింగ్ మూవీ టీం హాజరై ఆవిష్కరించనున్నారు. కటౌట్ ఆవిష్కరణ అనంతరం హెలికాప్టర్తో పూల వర్షం కురిపించేందుకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. తమ అభిమాన కథానాయకుడు భారీ కటౌట్ ఏర్పాటు చేయటం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 4, 2025
కృష్ణా: పరీక్షా ఫలితాలు విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఇటీవల నిర్వహించిన ఎం.ఫార్మసీ 3, 4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://kru.ac.in/ చెక్ చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం సూచించింది.
News January 3, 2025
విజయవాడ: కంపెనీలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో ఆర్టీసీ బస్సు ఓ ప్రైవేట్ కంపెనీలోకి దూసుకెళ్లింది. స్థానికుల వివరాల మేరకు.. శుక్రవారం సాయంత్రం VJA నుంచి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్తున్న RTC మెట్రో బస్సు అదుపుతప్పి ఓ ప్రైవేట్ కంపెనీలోకి దూసుకెళ్లింది. బస్సు ముందు భాగం బాగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించారు. ఈ క్రమంలో హైవేపై భారీ ట్రాఫిక్ నెలకొంది.