News April 2, 2025
విజయవాడలో రూ.252 కోట్ల పన్ను వసూలు

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.252 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు బుధవారం వీఎంసీ వెల్లడించింది. నగరపాలక సంస్థకు గతంలో ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలైనట్లు మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అనంతరం వీఎంసీ రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ సత్యవతిని మేయర్ అభినందించారు.
Similar News
News April 23, 2025
పాత బెడ్‌పై నిద్రిస్తున్నారా?

మనం పడుకునే బెడ్ కూడా నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏడేళ్లకు మించి ఒకే పరుపును ఉపయోగించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పాత బెడ్‌పై నిద్రిస్తే చేతులు, కాళ్ల నొప్పులతోపాటు నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. వెన్నునొప్పి సమస్యకు దారితీస్తుంది. పరుపుల తయారీలో వాడే నాఫ్తలీన్, బెంజీన్ వంటి వాటి వల్ల అలర్జీ, దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదముంది. 2-3 ఏళ్లకోసారి బెడ్స్‌ను మార్చడం బెటర్.
News April 23, 2025
టీ20ల్లో 12వేల పరుగుల క్లబ్‌లోకి హిట్‌మ్యాన్

SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ శర్మ టీ20ల్లో 12 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. 456 మ్యాచుల్లో హిట్‌మ్యాన్ ఈ ఘనత సాధించారు. ఈ 12K T20 క్లబ్‌లో కోహ్లీ తర్వాత చోటు దక్కించుకున్న రెండో భారత ప్లేయర్‌గా రికార్డ్ సృష్టించారు. ఓవరాల్ T20 క్రికెట్‌లో 8వ ప్లేయర్‌గా నిలిచారు. 12వేలు పరుగులు చేసిన లిస్టులో గేల్, అలెక్స్ హేల్స్, షోయబ్ మాలిక్, పోలార్డ్, కోహ్లీ, డేవిడ్ వార్నర్, జోష్ బట్లర్ ఉన్నారు.
News April 23, 2025
ఒంగోలులో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ

ఉగ్ర దాడిని నిరసిస్తూ ఒంగోలులో వైసీపీ క్యాండిల్ ర్యాలీ చేపట్టింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షతన మార్కెట్ కాంప్లెక్స్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.