News March 5, 2025
విజయవాడలో రేపు బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు

బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు గురువారం విజయవాడలోని సుజన ది వెన్యులో జరగనుంది. పార్టీ అధినేత రామచంద్రయాదవ్ సహా జిల్లాల నుంచి యువప్రతినిధులు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలో 50% సీట్లు యువతకే ఇస్తామని.. ఇప్పుడు నియమిస్తున్న బీసీవై యువదళం సభ్యుల్లోనే ఎక్కువమంది ప్రజా ప్రతినిధులుగా చట్ట సభల్లో అడుగు పెట్టేలా ప్రోత్సహించాలనేది తమ పార్టీ ఆలోచన అని రామచంద్ర యాదవ్ అన్నారు.
Similar News
News January 11, 2026
MLAపై మూడో రేప్ కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు

కేరళ MLA రాహుల్ మాంకూటతిల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే రెండు రేప్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా మూడో కేసు నమోదవడంతో అదుపులోకి తీసుకున్నారు. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పాలక్కాడ్లోని ఒక హోటల్లో ఆయన్ను పట్టుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి మోసం చేశాడని సదరు మహిళ ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బహిష్కరించింది.
News January 11, 2026
ఖమ్మం: పక్షి ప్రేమికుల ప్యారడైజ్.. పులిగుండాల!

పెనుబల్లి, కల్లూరు సరిహద్దుల్లోని పులిగుండాల అటవీ ప్రాంతం అరుదైన పక్షులకు నిలయంగా మారింది. ఇక్కడ ప్లమ్ హెడెడ్ పారకీట్, షిక్రా సహా 370 రకాల పక్షి జాతులు ఉన్నట్లు మిరాకీ సంస్థ గుర్తించింది. పక్షులు, వన్యప్రాణులు, జలపాతాలు ఉన్న ఈ ప్రాంతాన్ని పక్షి వీక్షణ కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు DFOసిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. పర్యాటకుల కోసం బర్డ్ వాక్, సఫారీ, బోటింగ్ సౌకర్యాలు తీసుకురానున్నారు.
News January 11, 2026
కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. జుక్కల్ 9.1°C, మేనూర్ 9.2, పెద్ద కొడప్గల్ 9.9, డోంగ్లి 10.1, బిచ్కుంద 10.2, లచ్చపేట 10.6, దోమకొండ 10.7, పుల్కల్, నస్రుల్లాబాద్, కొల్లూరు 10.8, ఇసాయిపేట 10.9, ఎల్పుగొండ 11, బీర్కూర్, మాచాపూర్, నాగిరెడ్డిపేట 11.1, రామారెడ్డి, బొమ్మన్ దేవిపల్లి, గాంధారి, పిట్లం 11.2°C ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


