News March 5, 2025
విజయవాడలో రేపు బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు

బీసీవై యువదళం ఆవిర్భావ సదస్సు గురువారం విజయవాడలోని సుజన ది వెన్యులో జరగనుంది. పార్టీ అధినేత రామచంద్రయాదవ్ సహా జిల్లాల నుంచి యువప్రతినిధులు పాల్గొననున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీలో 50% సీట్లు యువతకే ఇస్తామని.. ఇప్పుడు నియమిస్తున్న బీసీవై యువదళం సభ్యుల్లోనే ఎక్కువమంది ప్రజా ప్రతినిధులుగా చట్ట సభల్లో అడుగు పెట్టేలా ప్రోత్సహించాలనేది తమ పార్టీ ఆలోచన అని రామచంద్ర యాదవ్ అన్నారు.
Similar News
News March 25, 2025
ALERT: వడగాలులు.. వర్షాలు!

తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఏపీలో 52 మండలాల్లో వడగాలులు వీయనుండగా, మరోవైపు పలుచోట్ల అకాల వర్షాలు, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఉత్తర కేరళ వరకూ ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరగొచ్చని అంచనా వేశారు.
News March 25, 2025
MBNR: చట్టపరమైన చర్యలు తీసుకోవాలి: రంగినేని అభిలాశ్

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యల సరికాదని BRS మహబూబ్‌నగర్ నేత రంగినేని అభిలాశ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
News March 25, 2025
ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్: కేంద్రమంత్రి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే చోట దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక పోర్టల్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్రమంత్రి జితేందర్ సింగ్ తెలిపారు. దీనివల్ల ఉద్యోగార్థుల సమయం ఆదా అవటంతో పాటు సులభంగా అప్లై చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల రిక్రూట్ మెంట్ సగటు కాల వ్యవధిని 15 నెలల నుంచి 8నెలలకు తగ్గించామని వెల్లడించారు. మిషన్ కర్మయోగి పథకంలో ఇప్పటివరకు 89లక్షల ఉద్యోగులు చేరారని పేర్కొన్నారు.