News April 11, 2025

విజయవాడలో రైలు ఢీకొని మహిళ మృతి

image

విజయవాడ మధుర నగర్ రైల్వే గేట్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. నాగమణి అనే మహిళ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంది. గురువారం రాత్రి డ్యూటీకి వెళ్లే క్రమంలో సైకిల్ మీద ప్రయాణం చేస్తూ ఉండగా గేటు దాటేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో రైలు ఢీకొని దుర్మరణం చెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 6, 2025

పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆయనకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత కశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాంకు చెందిన ఫేమస్ బ్లాక్ టీ, మార్బుల్ చెస్ బోర్డు, మహారాష్ట్ర హస్త కళాకారులు చేత్తో చేసిన వెండి గుర్రం, ముర్షిదాబాద్‌కు చెందిన వెండి టీ కప్పుల సెట్ వంటి బహుమతులు అందజేశారు.

News December 6, 2025

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

image

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఉచిత శిక్షణ అందించనున్నట్లు DLTC ప్రధానాచార్యులు భూషణం ప్రకటించారు. ఇంటర్, అంతకంటే ఎక్కువ చదివిన 15-35 ఏళ్ల లోపు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఫీల్డ్ టెక్నీషియన్ – కంప్యూటింగ్ అండ్ పెరిఫెరల్స్ కోర్సులో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా ఏలూరులోని కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News December 6, 2025

వ్యూహ లక్ష్మి అచ్చును భక్తులందరూ చూడగలరా?

image

తిరుమలలో వ్యూహ లక్ష్మి దర్శన భాగ్యం అందరికీ దక్కదు. శ్రీవారిని గురు, శుక్ర వారాల్లో దర్శనం చేసుకునేవారికి మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. గురువారం నాడు శ్రీవారి ఆభరణాలు తొలగిస్తారు. అప్పుడు అమ్మవారిని నేరుగా చూడవచ్చు. మొదటి గడప దర్శనం అవకాశం దొరికిన వారికి వ్యూహలక్ష్మి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శుక్రవారం రోజున అభిషేకం, నిజపాద దర్శనంలో అమ్మవారి పసుపు ముద్రను దర్శించుకోవచ్చు.