News April 15, 2025
విజయవాడలో రోడ్డు ప్రమాదం.. (UPDATE)

రామవరప్పాడు వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కరెన్సీ నగర్కు చెందిన తల్లి భవాని, కుమారుడు అరవింద సాయిగా పోలీసులు గుర్తించారు. తల్లి మృతిచెందగా, కుమారుడికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News December 16, 2025
VKB: మూడో విడత 157 గ్రామపంచాయతీలకు పోలింగ్

మూడో విడత వికారాబాద్ జిల్లాలో 157 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. వికారాబాద్ జిల్లాలోని పరిగి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 157 గ్రామాలకు 18 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. పరిగి 32, పూడూరు 32, కుల్కచర్ల 33, దోమ 36, చౌడాపూర్ 24, గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
News December 16, 2025
NZB: మూడో విడత.. పోలింగ్ జరిగే మండలాలివే

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్కు 1100 మందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మూడో విడత పోలింగ్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని కమ్మర్పల్లి, మోర్తాడ్, భీమ్గల్, వేల్పూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల, ఆర్మూర్, ఆలూర్, నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో జరగనుంది.
News December 16, 2025
GNT: మృతదేహాల తరలింపులోనూ వసూళ్ల దందా.!

ఎంతో ఘన చరిత్ర ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు వసూళ్ల దందాకు పాల్పడుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. మృతదేహాన్ని ఉచితంగా గమ్యస్థానానికి చేర్చాల్సిన మహాప్రస్థానం వాహన డ్రైవర్లు దూరాన్ని బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రాణం కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.


